“సవ్యసాచిని కావడానికి నేను ఏకలవ్యుడిని కావడానికైనా సిద్ధపడతాను.”
“జీవన యాత్రలో నీకు కష్టం ఎదురొస్తే దానిని స్వాగతించు.”
“దృష్టి పెడితే నువ్వు చాలానే కనుక్కోవచ్చు.”
“ కిక్కిరిసిపోయిందది. ఎవరూ ఇంకక్కడికి పోవట్లేదు.”
“ఆలోచనమధ్య నేను ఏకాగ్రత చూపలేను.”
“భవిష్యత్తు మునిపటి మాదిరి ఉండదు.”
విజ్ఞాన సర్వస్వాన్నిదేనినీ నేను మా పిలగాళ్ళకు కొనివ్వను. నాకు లాగానే వాళ్ళనీ బడికి పోనివ్వండి.
“ గతి తప్పాంగానీ మనం పురోగమిస్తూనే ఉన్నాం.”
“సగంపైగా నామీద వాళ్ళు చెబుతున్నవన్నీ అసత్యాలే."
“యాగాణీ పనికి దమ్మిడీ ఖర్చు”
“ అదే పాతచింతకాయ పచ్చడి మళ్ళీ మళ్ళీ .”
“అంతా ఒక కొలిక్కి వస్తేగాని సంపూర్ణమయినట్టుకాదు.”
శ్రీమతి లిండ్సే: “నిజంగా మీరు ప్రశాతంగా కనిపిస్తున్నారు.” యోగి బెరా: ధన్యవాదాలు, మీరేం అంత ఉద్రేకంగా ఉన్నట్టు లేదే?
లోకం లోపరహితమయిఉంటే గనుక అది నిలిచివుందేదికాదు.