నేను సవ్యసాచిలాగా కుడి భుజాన్ని అయి ఉండాలనుకుంటున్నాను.
మీరు రహదారి ఇబ్బందిలో ఉన్నప్పుడు నన్ను అలా ఉపయోగించుకోవచ్చు.
మీరు కొంచెం పరిశీలిస్తే చాలా చూడవచ్చు.
ఇకపై ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అది చాలా రద్దీగా ఉన్నది.
నేను ఆలోచిస్తున్నప్పుడు దేనిమీద దృష్టి పెట్టలేను.
ఏది ఉపయోగించబోతున్నవో అది భవిష్యత్తు కాదు.
నేను నా పిల్లలకు ఎన్సైక్లోపిడియా కొనివ్వబోవటంలేదు. వాళ్ళను నేను ఎలా చదువుకున్నానో అలానే వెళ్ళనివ్వండి.
మేము ఓడిపొయ్యాము,కాని మంచి సమయాన్ని గడిపాము.
వాళ్ళు నా గురించి చెప్పిన అబద్ధాలలో సగభాగం నిజాలు కావు.
నాణానికి దమ్మిడి విలువ లేదు.
అది మళ్లీ జరింగిందా అని అనిపిస్తుంది.
అది అయిపోయినప్పటికి, అది ఇంకా అయిపోలేదేమోననిపిస్తుంది.
శ్రీమతి లిండ్సే: మీరు చాల ప్రశాంతంగా ఉన్నారు. యోగి బెర్ర: మీరు ఏమి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా కనిపించటంలేదు.
ప్రపంచం ఖచ్చితంగా ఉన్నట్లయితే అది అలా ఉండకపోవచ్చు.